దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉద్యోగనగర్ లోని షూ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 8.22 గంటలకు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షూ ఫ్యాక్టరీలో మంటలంటుకోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 31 వాహనాలతో హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు గల్లంతు అయ్యారని అధికారులు చెప్పారు. షూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు కనిపించడం లేదని, వారి గురించి గాలిస్తున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టరు అతుల్ గార్గ్ చెప్పారు. మంటలను అగ్నిమాపక శాఖ వాహనాలతో అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు సైతం సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/