చిత్రసీమలో డ్రగ్స్ కలకలం..స్టార్ హీరోయిన్ సోదరుడు అరెస్ట్

చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్‌ సోదరుడు సిద్ధాంత్ క‌పూర్‌ డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేసారు.బెంగుళూరు ఎం.జి రోడ్డులోని ఓ పార్టీలో సిద్ధాంత్ క‌పూర్‌ పాల్గొన్నారు. ఆ పార్టీలో డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు పోలీసుల‌కు సమాచారం అందడం తో వెంట‌నే వారు రంగంలోకి దిగి రైడ్ నిర్వ‌హించి కొంద‌రిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వ‌హించిన టెస్టులో ఐదుగురు వ్యక్తులు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లుగా నిర్దార‌ణ అయ్యింది. వారిలో సిద్ధాంత్ క‌పూర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

డ్ర‌గ్స్ కేసులో కొడుకు సిద్ధాంత్ క‌పూర్ అరెస్ట్ కావ‌టంపై హీరో శ‌క్తి క‌పూర్ స్పందిస్తూ ‘‘అసలేం జరిగిందో నాకు తెలియదు. నా ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుంటే సగం నిద్ర నుంచి లేచాను. సిద్ధాంత్‌ను పోలీస‌లు అరెస్ట్ చేయ‌లేదు. అయితే త‌ను డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విష‌యంపై నాకెంతో బాధగా ఉంది’’ అన్నారు. పలు బాలీవుడ్ ఫిల్మ్స్ కు కో డైరెక్టర్ గా పని చేసిన సిద్ధాంత్.. పలు సినిమాల్లో నటుడిగానూ పని చేశాడు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.