విస్ట్రాన్‌పై యాపిల్‌ సంస్థ ఆగ్రహం

తక్షణమే సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం

'Apple' is angry with Wistron
‘Apple’ is angry with Wistron

బెంగళూరు: యాపిల్‌ ఫ్రాంచైజీ తయారీసంస్థ విస్ట్రాన్‌లో సంభవిం చిన సంఘటనలకు సంబంధించి యాపిల్‌ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సర్దుబాటు చేసుకోవాలని, వేతనబకాయిలపై సిబ్బంది నుంచి ఎదురవుతున్న అసహనంపై దృష్టిపెట్టాలని అంతవరకూ కొత్త బిజినెస్‌ ఇచ్చేదిలేదని స్పష్టంచేసింది.

దీనితో విస్ట్రాన్‌ కంపెనీ తన ఉపాధ్యక్షుడు విన్సెంట్‌లీని తక్షణమే తొలగించింది. అలాగే ఉద్యోగులందరికీ జరిగిన పరిస్థితిపై విచారం వ్యక్తంచేస్తూ ఇకపై పునరావృతం కాబోదని హామీ ఇచ్చింది.

పరిస్థితిపై సమగ్ర విచారణచేస్తున్నట్లు వెల్లడించింది. పనిచేసేఅందరినీ హుందాగాను, గౌరవంతోను చూడాలని, వెంట నే వారికి తక్షణమే పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని సూచించింది.

కోలార్‌లోని విస్ట్రాన్‌కంపెనీ కాంట్రాక్టు ఉద్యోగులు తమకు జీతాలు చెల్లించడంలేదని, ఎలాం టి కారణం లేకుండా వేతనాల్లో కోతలు విధిస్తున్నారని, పనిగంటలు పెంచేసార ని ఈనెల 12వ తేదీ పెద్ద ఎత్తున నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.

దీనిపై యాపిల్‌సంస్థ దృష్టిసారించింది. విస్ట్రాన్‌ ఇండియా యాపిల్‌కాంట్రాక్టు ఉత్పత్తి దారుగా ఉండటంతోయాపిల్‌కూడా తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగేదిగా భావిస్తోంది. అంతేకాకుండా కంపెనీ తక్షణమే ఈ సవరణలు చేసేంతవరకూ ప్రొబేషన్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా యాపిల్‌ కంపెనీలో జరిగిన దుర్ఘటనలపై విచారణ చేస్తోంది.

కేవలం వేతన బకాయిలకారణంగానే కాంట్రాక్టు ఉద్యోగులు హింసాత్మక చర్యలకు దిగారని, పెద్ద ఎత్తున ఆస్తిధ్వంసం చేసారని, ఐఫోన్లు, ఇతర విలువైన వాటిని తస్కరించినట్లు తేలింది. సుమారు 50 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అప్పట్లోనేవిస్ట్రాన్‌ అంచనావేసింది. కంపెనీ సరఫఱా నియమావళిని ఉల్లంఘించిందని, సరైన పనిగంటల విధానం కూడా అనుసరించలేదని వెల్లడించింది.

దీనితోపాటుజీతాల బకాయిలుకూడాకొందరికి అక్టోబరు,నవంబరునెలల్లో లేవని యాపిల్‌ గుర్తించింది. యాపిల్‌సంస్థ తన సొంత ఉద్యోగులు, స్వతంత్ర ఆడిటర్లు వెళ్లి వారి ప్రగతిని పరిశీలిస్తారని, విస్ట్రాన్‌ కంపెనీఐఫోన్‌ ఎస్‌ఇ, ఇతర ఐఫోన్లను భారత్‌లోనే తయారుచేస్తున్నదని అందువల్లనే సంస్థ అత్యధిక ప్రాధాన్యతాక్రమంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుప్రకటించింది.

విస్ట్రాన్‌కంపెనీ తన భారత ఇన్‌ఛార్జిని విస్తరణ పథంలో ఉన్న లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా పలు లోపాలను ఎత్తిచూపించింది. ఆరు సిబ్బంది సంస్థలపె ౖకర్ణాటక కూడా ఫైర్‌ అయింది. తైవాన్‌కు చెందినీ ఉత్పత్తిసంస్థ కూడాకర్ణాటక యూనిట్‌ పరిస్థితిపై దర్యాప్తుచేస్తామని ప్రకటించింది. సిబ్బందిని సరఫరాచేసే సంస్థలు అనేకమంది కార్మికులు, ఉద్యోగుల జీతాలను ఇతరత్రా బదలాయించినట్లు ఆరోపణలున్నా యి.

ఇకపై పరిస్థితులు పునరావృతం అయితే విస్ట్రాన్‌ కంపెనీ పరిస్థితిని మరింతగా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుందని యాపిల్‌ వెల్లడించింది. 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నకోలార్‌లోనినరసాపూరప్లాంట్‌లో సుమారు వెయ్యిమందికిపైగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలో కన్నడ, తెలుగు,తమిళ్‌, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఫిర్యాదులు చేసుకునేందుకు హాట్‌లైన్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

గతవారంలోనే కంపె నీ ఉద్యోగులు హింసకు పాల్పడటంతో కిటికీల అద్దాలు, ఎటిఎం యంత్రాలు, సిసిటివి కెమేరాలు,వాహనాలు ధ్వంసం అయ్యాయి.

సకాలంలో వేతనాలు చెల్లించక పోవడం, అకారణంగా వేతనాల్లో కోత విధించడం వంటి ఆరోపణలుచేసారు. ఈహింసకు సంబంధించి కర్ణాటక పోలీసులు 160 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలి సిందే.

రెండువేల మందితో ఉన్న ఉద్యోగులను కంపెనీ 12 వేల మందికి పెంచింది. దీనిపై కర్ణాటక కార్మిక శాఖ కూడా అనేక లోపాలను ఎత్తిచూపించింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/