కేంద్ర విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదం

cm kcr

హైదరాబాద్‌: అసెంబ్లీలో విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదమని ఆయన అన్నారు. ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది. కానీ చెన్నైలో తాగునీటికి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చాల‌నే దృక్ప‌థం బిజెపి, కాంగ్రెస్ పార్టీల‌కు లేకుండా పోయింది. దేశంలో 40 కోట్ల ఎక‌రాల భూమి సాగులో ఉంది. పుష్క‌లంగా స‌రిపోయే నీరు ఉన్నా.. సాగుకు ఇవ్వ‌లేదు. దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్ష‌ల మెగావాట్ల పైనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 16 వేల మెగావాట్లు మాత్ర‌మే దేశంలో వాడారు. దేశ ప్ర‌గ‌తి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాల‌నే ఆలోచ‌న లేదు. కేంద్ర విద్యుత్ చ‌ట్టాన్నితాము పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకిస్తామ‌న్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/