శ‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సందర్శించిన ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్

శ‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మంలో చ‌ర‌ఖ‌ తిప్పిన బ్రిట‌న్ ప్ర‌ధాని

అహ్మాదాబాద్‌: నేడు భారత్ పర్యటనకు వచ్చిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అహ్మ‌దాబాద్‌లోని శ‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఆ ఆశ్ర‌మంలో మ‌హాత్మా గాంధీ వాడిన నూలు చ‌ర‌ఖ‌ను బోరిస్ జాన్స‌న్ తిప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజిట‌ర్స్ బుక్‌పై సంత‌కం చేశారు. ఓ అసాధార‌ణ వ్య‌క్తికి చెందిన ఆశ్ర‌మాన్ని విజిట్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తాన‌ని, ప్ర‌పంచాన్ని ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు స‌త్యం, అహింసా సిద్ధాంతాల‌ను గాంధీ ఎలా వాడ‌ర‌న్నది ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని ఆ బుక్‌లో బోరిస్ రాశారు. గాంధీ రాసిన గైడ్ టు లండ‌న్ అన్న పుస్త‌కాన్ని బోరిస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/