భార‌త విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ

జూలై వరకు పొడిగింపు

దుబాయి: యూఏఈ ప్రభుత్వం భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూలై వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్ధ ఈ విషయం వెల్లడించింది. భారత్‌లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో ఏప్రిల్‌ 24న విమానయానంపై విధించిన నిషేధాన్ని యూఏఈ ఇప్పటివరకు రెండు సార్లు పొడిగించింది. ప్రస్తుతం దుబాయి నుంచి భారత్‌కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ భారత్‌ నుంచి మాత్రం విమానాల రాకపై నిషేధం ఉంది. కేవలం దౌత్యవేత్తలు, యూఏఈ పౌరులు, ఎంపిక చేసిన గోల్డెన్‌ వీసా హోల్డర్లను మాత్రమే తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/