మంచు మనోజ్‌ పెళ్లి వీడియో సాంగ్‌ రిలీజ్‌

మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ల వివాదం మార్చి 03 న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ ఇంట ఈ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట పలు సందర్భాలలో దర్శనమించారు. ఇక ఇటీవలే వెన్నెల కిషోర్‌ హోస్ట్‌గా చేస్తున్న అలా మొదలైంది ప్రోగ్రాంకు కూడా ఈ జంట హాజరై సందడి చేసారు.

తాజాగా వీరి పెళ్లి సంబదించిన వీడియో ను రిలీజ్ చేసారు. పెళ్లివేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశాడు. ఏం మనసో.. ఏం మనసో అంటూ ఓ పాటను ఆ వీడియోకు జత చేశాడు. అచ్చు రాజమని కంపోజ్‌ చేసి ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించాడు. పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలన్ని ఈ వీడియోలో చూపించారు. హల్దీ ఫంక్షన్‌, రింగులు మార్చుకోవడం సహా పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. ఈ వీడియోలో మోహన్‌బాబు, మౌనిక రెడ్డి కళ్లు తుడవడం. హత్తుకోవడం వంటివి కాస్త ఎమోషనల్‌గా అనిపించాయి. ఇక వీడియో చివర్లో ఇది శివుని ఆజ్ఞ అంటూ మనోజ్‌, భూమా మౌనికారెడ్డి, ఆమె తనయుడి చేతులు ఒకరిపై ఒకరు వేసుకుని ఉండటం వీడియోకే హైలెట్‌గా నిలిచింది.

YouTube video