ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Encounter
Encounter

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టారు. ఘటనాస్థలి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/