శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాల కాల్పులు జరిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని లష్కరే తొయిబాకు (LeT) చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/