ఏపీ కొత్త మంత్రులు వీరే

మరికాసేపట్లో ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈరోజు 11 గంటల 27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్‌ సహా అనేక మంది ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలో కూటమిలో ఎవరికీ మంత్రి పదవులు ఇస్తారా అనే ఆసక్తి నెలకొని ఉండగా..వాటికీ తెరదించారు చంద్రబాబు. మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది.