అధ్యక్ష ఎన్నికల తేదిల్లో మార్పులుండవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

 donald trump
donald trump

వాషింగ్టన్‌: కరోనా మహామ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచం స్థంబించిపోయింది. పలు దేశాలలో జరాగాల్సిన ఎన్నికలు, అంతర్జాతీయంగా జరగాల్సిన క్రీడా టోర్నీలు కూడా రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబర్‌ నెలలో జరగాల్సిన అధ్యక్ష్య ఎన్నికలపై సందేహాలు నెలకొన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధ్యక్ష్య ఎన్నికలను వాయిదా వేసే విషయాన్ని ఆలోచించాలని ప్రతిపక్ష నేతలు కోరగా.. దీనిపై స్పందించిన ట్రంప్‌ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడతాయని తాను అనుకోవడం లేదని అన్నారు.ముందుగా నిర్ణయించిన తేది ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ట్రంప్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/