పసుపుతో నొప్పులు దూరం

ఇంటింటి చిట్కా వైద్యం

turmeric powder for pain relief
turmeric powder for pain relief

భారతదేశంలో విస్తృతంగా ప్రజలందరు ఉపయోగించే ఆరోగ్యకరమైన పదార్థాలలో పసుపు ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్‌ పదార్థాం ఉండడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పసుపుతో బ్యాక్టే రియా, వైరల్‌ ఇన్‌ఫైక్షన్స్‌ తగ్గుతా యని మనకు తెలుసు. కానీ మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌ సైతం తగ్గుతాయని ఆస్ట్రేలియాలోని టాస్క నియా విశ్వవిద్యాలయానికి చేసిన అధ్యయనంలో తేలింది.

కాగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 మందిని కొన్ని వారాలపాటు పరీక్షించగా, బాధితులకు ఉపశమనం కలిగిందని తెలిపారు. అన్నల్‌ మెడిసిన్‌, జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయన సంస్థలు సైతం పసుపుతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని దృవీకరించాయి. భారత సంస్కృతిలోనే మెజారిటీ రోగాలకు పసుపును విరివిగా వాడేవారు.

కానీ గత కొంత కాలంగా అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా యాంటీ వైరల్‌ జబ్బులకు పసుపు ఎంత మేలు చేస్తోందో ఆయుర్వేద నిపుణులు తెలియజేయడంతో ప్రస్తుతం పసుపును విరివిగా వాడుతున్నారు. అయతే గతంలో కొందరు అల్లోపతి వైద్యులు కేవలం ఇంటి చిట్కాలకే ఉపయోగపడుతుందని భావించేవారు.

కానీ విదేశీయుల అధ్యయనంలో కూడా పసుపు ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గనున్నట్లు తేల్చడం దేశ ఆయుర్వేధనికి ఎంతో ప్రయోజనకరం.

పసుపును ఉపయోగించే విధానాలు :

  • పసుపును పదార్ధాల రూపాల్లోనే కాకుండా మాత్రల రూపంలో కూడా ఉపయోగించవచ్చు. సాధారణంగా మన భారతీయుల వంటలలో పసుపును విరివిగా వాడుతుంటారు.
  • పసుపులో లభించే కర్కుమిన్‌ పదార్థం వల్ల ఎంతో లాభం. పాలలో పసుపునువేసి త్రాగితే అనేక రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
  • అదే విధంగా పసుపుతో కలిపిన టీ త్రాగినా ఆరోగ్య పటిష్టతకు ఎంతో లాభమని నిపుణులు సూచిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/