బిగ్ బాస్ 5 : ఫస్ట్ డే నే టాస్క్ లతో కంటెస్టెంట్స్ కు చెమటలు పట్టించిన బిగ్ బాస్

బుల్లితెర ప్రేక్షకులతో పాటు యావత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం (సెప్టెంబర్ 05 ) అట్టహాసంగా మొదలైంది. మొత్తం 19 సభ్యులతో ఈసారి బిగ్ బాస్ అంతకు మించేలా ఉండబోతుందని అర్ధమవుతుంది. మొదటి కంటెస్టెం‍ట్స్‌గా సిరి హన్మంత్‌, ఆ తర్వాత వీజే సన్నీ, లహరి షారి, సింగర్‌ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌, మహమ్మద్‌ ఖయ్యూం (లోబో ), సినీ నటి ప్రియ , జెస్సీ ( జశ్వంత్‌ పడాల ), ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్ జస్వంత్, నటరాజ్ మాస్టర్,సరయు, సీరియల్ నటుడు విశ్వా, ‘కార్తిక దీపం’ సీరియల్‌ ఫేమ్‌ ఉమాదేవి, నటుడు మానస్‌ , ఆర్జే కాజల్, శ్వేత వర్మ చివరగా యాంకర్‌ రవి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఫస్ట్ డేనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రకరకాల టాస్క్ లు ఇచ్చి చెమటలు పట్టించారు. గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ మొదటిరోజు మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇక ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ వారి స్టైల్ లోనే హౌజ్ లోకి అడుగు పెట్టారు.

హౌస్‌లోకి వెళ్లిన ఐదుగురికి ఫస్ట్ మ్యూజికల్‌ చైర్‌ మాదిరి టాస్క్‌ ఇచ్చాడు నాగ్‌. దీనికి ‘దండం వేసి దండం పెట్టు’ అని పేరు పెట్టాడు. మ్యూజిగ్‌ ఆగేలోపు ఎవరి దగ్గర పూలమాల(దండ) ఆగుతుందో వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పాడు. లహరితో ఈ గేమ్‌ మొదలైంది. ఈ గేమ్‌లో సన్నీ గెలిచి, మొదటి బెడ్‌ని అన్‌లాక్‌ చేసే పోటీలో నిలిచాడు. ఆ తర్వాత హౌస్‌లోని పది మందికి పకడో పకడో అనే రెండో టాస్క్ ఇచ్చాడు నాగార్జున. నాలుగు జంతువులను నాలుగు రూమ్‌లో దాచి పెట్టి.. ఏ జంతువు శబ్దం వస్తే ఆ జతువును వెతికి పట్టుకోవాలని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో మొదటి రౌండ్ లో షణ్ముఖ్ , జెస్సీ ఓడిపోయారు. రెండో రౌండ్‌లో ప్రియాంక విన్ అయ్యింది.

మూడో టాస్క్ చివరిగా వచ్చిన ఐదుగురికి ఇచ్చాడు నాగ్. ఎవరైతే ఐదు కుల్ఫీలు తింటారో వాళ్ళే విన్ అవుతారని చెప్పాడు. దాంతో అందరు పోటీపడి మరీ కుల్ఫీలను తిన్నారు. ఈ టాస్క్ లో విశ్వ విజేత అయ్యాడు. లాస్ట్ గా సింగిల్ బెడ్ కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీనికి రోల్ బేబీ రోల్ అనే పేరు పెట్టాడు. నలుగురితో డైస్ వేయించి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వారే విన్ అని చెప్పాడు బిగ్ బాస్. మొదటగా మానస్ డైస్ వేసాడు. ఆతర్వాత కాజల్ డైస్ వేసింది. ఆతర్వాత శ్వేతా వర్మ. చివరిగా రవి డైస్ వేసాడు. ఈ టాస్క్ లో మానస్ విన్ అయ్యాడు. మొత్తం మీద ఫస్ట్ సభ్యుల గ్రాండ్ ఎంట్రీ..హౌస్ లో ఒకరికొకరు పరిచయాలు..తర్వాత బిగ్ బాస్ టాస్క్ లు , చివర్లో బెడ్స్ పంచుకోవడం ఇలా సరదాగా సరదాగా సాగింది. రేపటి నుండి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో..సభ్యుల మధ్య ఎలాంటి టాస్క్ లు ఉండబోతాయో..ఎవరెవరి మధ్య ఎలాంటి గొడవలు మొదలవుతాయో చూడాలి.