మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు

మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Strong quake hits southern Mexico

మెక్సికో: మెక్సికోలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. భూకంపం తీవ్రత 7.7గా ఉందని, ఒక్సాకాలో భూకంప కేంద్ర ఉన్నదని అమెరికా జియలాజికల్‌ సర్వే ప్రకటించింది. అమెరికా, కెనడా దేశాల పర్యాటకులు సందర్శించే హువాతుల్లో బీచ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. సుమారు రెండు వందల ఇండ్లు దెబ్బతిన్నాయని ఒక్సాకా రాష్ట్ర గవర్నర్‌ అలెజంద్రో మూరత్‌ ప్రకటించారు. భూకంప ప్రభావంతో వందల కిలోమీటర్ల దూరంలోని దేశ రాజధాని మెక్సికోసిటీలో భవనాలు కంపించాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఒక్సాకా తీరంలోని సముద్ర నీటిమట్టం 60 సెంటీమీర్ల మేర పెరిగిందని మెక్సికో సెస్మాలజీ సర్వీస్‌ అధికారులు తెలిపారు. తీవ్ర భూకంపం వల్ల మెక్సికో సముద్ర తీరప్రాంతంలో 3.28 అడుగుల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉన్నదని అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అధికారులు వెల్లడించారు. మూడేళ్ల క్రితం సంభవించిన భారీ భూకంపంలో 355 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/