మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులతో TSRTC సిద్ధం

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది.

ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ఈ క్రమంలో TSRTC భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది.

టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు పరిశీలించారు. తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్ ను వారు పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్ లో టీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.