బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు

సీఎం రేవంత్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫై మంచిర్యాల పోలీసులు కాసే నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ రెచ్చిపోయారు. సంస్కారం అడ్డువస్తోంది అంటూనే.. అసభ్యపదజాలంతో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పద్దతిగా మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా KCRను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అంటూ ఏకంగా చెప్పు చూపించి రెచ్చిపోయారు.

అయితే, బాల్కసుమన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ఇక సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.