ఈనెల 13 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు – TSRTC

దసరా పండగ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 24 వరకు TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. తెలంగాణ లో అతి పెద్ద పండగ అంటే దసరా అనే చెప్పాలి. ఈ పండగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా TSRTC ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచబోతుంది.

ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్‌ బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అధ్యక్షతన పోలీస్‌, రవాణాశాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో… ఆర్టీసీ ఉద్యోగులతోపాటు పోలీస్‌, రవాణాశాఖల సహకారం కూడా ఎంతో ఉందన్నారు సజ్జనార్‌. పండుగల వేళ ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పోలీసు, రవాణాశాఖ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఈసారి కూడా ఆ శాఖలు సహకారం అవసరమని చెప్పారు సజ్జనార్. ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్‌ బస్సులు సిద్ధం చేసినా..ఈనెల 20 నుంచి 23 వరకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని… దీంతో ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గత ఏడాది దసరాకు 4వేల 280 ప్రత్యేక బస్సులను నడిపింది టీఎస్‌ఆర్‌టీసీ. ఈ ఏడాది మాత్రం మరో వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది.