గుంటూరు జిల్లాలో యువతిపై సామూహిక అత్యా చారం
సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ప్రేమజంటపై దుండగుల దాడి

Tadepalli: తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. . కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని తెలిసింది. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇ జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బాధితురాలు కాబోయే భర్తతో కలిసి కృష్ణ నదిలోని పుష్కర ఘాట్ వద్దకు వెళ్లిందని యువతి బంధువులు వెల్లడించారు. బ్లేడ్ బ్యాచ్‌లోని ముగ్గురు ఆ ఇద్దరిపై దాడి చేసి సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. .
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/