నగరవాసుల కోసం సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చిన TSRTC

ప్రయాణికులకు TSRTC నిత్యం ఏదోక ఆఫర్ తో ఆకట్టుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రవైట్ ట్రావెల్స్ కు ధీటుగా పండగ సమయాల్లోనే కాదు మిగతా రోజుల్లో కూడా అనేక బంపర్ ఆఫర్లను అందిస్తూ వస్తుంది. తాజాగా హైదరాబాద్ నగరవాసుల కోసం రెండు సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. టీ 6 , ఎఫ్ 24 పేరుతో రెండు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. జీఎచ్ఎంసీ పరిధిలో రూ. 50 రూపాయల టికెట్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు మహిళలు, సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేసేలా టీ 6 టికెట్ ను తీసుకొచ్చింది.

అలాగే శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడేస్ లో ఒక ఫ్యామిలీలో నలుగురు రూ. 300 రూపాయలతో ఒక రోజంతా ప్రయాణం చేసేందుకు ఎఫ్ 24 టికెట్ ను తీసుకొచ్చింది. టీ 6, ఎఫ్ 24 ఆఫర్లకు సంబంధించిన పోస్టర్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్ భవన్‌లో విడుదల చేశారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్లు రేపటి నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో తీసుకువచ్చిన టి-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఆర్ఎస్ టీ 6, ఎఫ్ 24 లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.