పార్టీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు

తప్పుడు ప్రచారంతో తనకేం సంబంధం లేదన్న పొంగులేటి

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రాజ్యసభకు కే. కేశవరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్లను సిఎం కెసిఆర్‌ ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పై తనకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్‌, కెటిఆర్‌లను కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం నుంచి తనకు పిలుపు వచ్చిందన్న ప్రచారం అవాస్తవమని ఆయన అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో పార్టీ అధినేత నిర్ణయమే ఆఖరు అని స్పష్టం చేశారు. కాగా టిఆర్‌ఎస్‌కు రెండు రాజ్య సభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. అయితే టిఆర్‌ఎస్‌ నుంచి కేకే, పొంగులేటిని రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/