నిరాహారదీక్షలు చేపట్టిన బాబు , లోకేష్ , భువనేశ్వరి

స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుఅరెస్టు ను ఖండిస్తూ..సత్యమేవ జయతే పేరుతో ఈరోజు టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. జైళ్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ ,రాజమండ్రి లో భువనేశ్వరి దీక్షలు స్టార్ట్ చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా టీడీపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా ఈరోజే నిరాహార దీక్ష చేపడుతుండటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్షను శాంతియుతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం బాబు ఫై స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎలైన్ మెంట్ మార్పుల కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుతో పాటు మరో కేసు జాబితాలో చేరింది. ఓటుకు నోటు కేసు ఇప్పుడు మరింత యాక్టివ్ గా మరింది. దీనిపై అక్టోబర్ 4వ తేదీని సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.