కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజక వర్గంలోని రావులపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో ఆ గ్రామంలో ఏమి జరుగుతుందోననే పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సొంత గ్రామమైన రావులపల్లిలో ఆయన కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. బిఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్లి తమకు సహకరించాలని కోరారు.

ఈ క్రమంలో బిఆర్ఎస్ నేతలు మా వద్దకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సమాచారం తెలుసుకున్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి రావులపల్లి గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి పోలీసులు చేసుకొని స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసుల బందోబస్త్ పెంచారు.