పంట దెబ్బతిన్న గ్రామాల్లో మంత్రుల బృందం పర్యటన

నష్టం అంచనా తర్వాత సీఎం కు నివేదిక

Ministers visiting crop-damaged fields
Ministers visiting crop-damaged fields

Warangal District: ఇటీవల కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను మంగళవారం మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. పంట నష్టంపై సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఇవాళ పరకాల మండలంలోని నాగారం, మల్లక్కపేట గ్రామాల్లో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి నాగారం గ్రామంలో దెబ్బతిన్న మిర్చి తోటను, మల్లక్కపేట లో మిర్చి తోటను పరిశీలించారు. నష్ట పరిహారం అందిస్తామని రైతులకు చెప్పారు. మంత్రుల వెంట వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. పంట నష్టాన్ని అంచనా తర్వాత సీఎంకు అధికారులు నివేదిక అందజేయనున్నారు.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/