శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ. ఈరోజు తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు.

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ​కు వైరల్ ఫీవర్ రావడం.. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆమె శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిసింది. కేసీఆర్​ త్వరగా పూర్తిగా కోలుకోవాలని తిరుమలేశుడిని కోరుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. నిన్న 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే 68,828 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.