ధరణి పోర్టల్‌ చిరస్థాయిగా నిలుస్తుంది..కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రారంభించ‌నున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ చిర‌స్థాయిగా నిలుస్తుందని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. అవినీతికి ఆస్కారం లేని పూర్తి పార‌ద‌ర్శ‌క విధానంలో లావాదేవీలు జ‌ర‌ప‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కెటిఆర్‌ ఉద్ఘాటించారు. స‌మీకృత భూరికార్డుల నిర్వ‌హ‌ణ విధానంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ కీల‌క‌మ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఏక‌కాలంలో రిజిస్ర్టేష‌న్లు, మ్యుటేష‌న్లు జ‌రుగుతాయ‌న్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శ‌కంగా నిలుస్తుందని కెటిఆర్‌ అన్నారు.

కాగా సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రూపొందించిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ప్రారంభించనున్న విషయం తెలిసిందే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/