ప్రపంచంలో అత్యంత విగ్రహాలు కలిగిన మహానేత అంబ్కేదర్‌: మంత్రి హరీశ్‌రావు

ts-minister-harish-rao-unveiled-ambedkar-statue-at-koheda

హైదరాబాద్‌ః మంత్రి హరీశ్‌రావు కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణకు కృషి చేసిన సంఘాలు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అందరివాడని, ఆరాధనీయుడని.. అందరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. నేటి సమాజంలో దేశంలోని ఎన్నో కులాలు, మతాలకు చెందిన వారంతా కలిసి ఉండడానికి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమేనని చెప్పుకోక తప్పదన్నారు. అన్నివర్గాలు బాగుపడాలని, ముందుకు రావాలనే ముందుచూపుతో స్వీయ అనుభవంతో చేసిన ఆలోచనలన్నారు.

నేటి విద్యార్థి లోకం, సమాజం ఆదర్శంగా తీసుకోవాలని, వీధిదీపాల కింద చదువుకొని విదేశాలకు వెళ్లి.. రాజ్యాంగం రాసి ఈ స్థాయికి వచ్చేరంటే దేశానికి ఎంతో ఆదర్శవంతం అన్నారు. ప్రపంచంలో అత్యంత విగ్రహాలు కలిగిన మహానేత అంబ్కేదర్‌ అన్నారు. సమాజసేవ, సమాజ హితం, సమాజం కోసమై ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారని, అందులో పెద్దగా చెప్పుకునేది అంబేద్కర్ గురించి మాత్రమేనన్నారు. విద్య అనేది ఎంత ముఖ్యమో సమాజానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని స్ఫూర్తినిచ్చిన నేత అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/