యధావిధిగా మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ వెల్లడి

Inter exams from May 1
Inter exams from May 1

Hyderabad: ముందుగా ప్రకటించిన విధం గానే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటింఛామని ఆయన గుర్తు చేశారు. మరో 20 రోజుల సమయం ఉన్నందున అన్ని పరీక్షా కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/