హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

Prime Minister Narendra Modi arrives in Hyderabad

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మోడీకి.. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు వెళ్లనున్నారు. భాగ్యనగరానికి మోడీ రాకతో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. మరోవైపు.. పులి వేషాలు, డప్పు సప్పులతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

కాగా.. ఐఎస్‌బీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీరిలో మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 విద్యార్థులు కూడా ఉండనున్నారు. దీంతో మొత్తం 930 మంది సోషల్ మీడియా ఖాతాలను కూడా ఎస్పీజీ అధికారులు జల్లెడపడుతున్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు. అంతేకాక, విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఎస్పీజీ అధికారులు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాల్లో ఏ సమస్య లేదని తేలితేనే విద్యార్థులకు ఎంట్రీ పాసులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాదించిన 8 మందికి ప్రధాని మోడీ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందించనున్నట్లు ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/