ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఫస్టియర్ పరీక్షలను ఇప్పటికే రద్దు చేసినప్పటికీ సెకండియర్ పరీక్షల నిర్వహణపై డోలాయమానంలో పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ ఈ విషయమై చర్చకు వచ్చినప్పటికీ పరీక్షల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా స్పందించారు. పరీక్షల రద్దు విషయంలో ఇప్పటి వరకైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. ఈ విషయమ త్వరలోనే సమీక్ష నిర్వహించిన అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/