ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా శ్రీవాత్సవ

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ నియామకమయ్యారు. ప్రస్తుతం సిపిగా కొనసాగుతున్న అమూల్య పట్నాయక్ ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శ్రీవాస్తవను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి ఒకటిన ఢిల్లీ సిపిగా శ్రీవాత్సవ బాధ్యతలను చేపట్టనున్నారు. శ్రీవాత్సవ 1985 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను అరికట్టడంలో అమూల్య పట్నాయక్ విఫలమయ్యారని విమర్శలు వెలువెత్తాయి. ఢిల్లీలో చోటు చేసుకున్న ఘర్షణ, అల్లర్లలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ పోలీస్ శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్‌గా ఎన్ఎన్ శ్రీవాత్సవను నియమిస్తూ ఈ నెల 25 న రాత్రి హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే శ్రీవాత్సవ రంగంలోకి దిగారు. గతంలో ఢిల్లీ పోలీస్ అత్యున్నత ప్రత్యేక విభాగాని (ఎలైట్ స్పెషల్ సెల్) కి ఆయన నేతృత్వం వహించారు. శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్ గా నియామకమైన శ్రీవాత్సవను నేడు సిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/