ఎట్టకేలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరో బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ సర్కార్ కొత్త బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో రాజాసింగ్ కు కేటాయిచిన బులెట్ ప్రూఫ్ వాహనం అనేక సార్లు ఆడిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న నడి రోడ్డు ఫై ఆగిపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఎన్నోసార్లు బులెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వానికి తెలియజేసిన పట్టించుకోలేదు. ఈసారి మాత్రం పాత వాహనం ప్లేస్ లో మరో వాహనాన్ని కేటాయించింది. పోలీసులు నిన్న ఆయనకు వేరే వాహనాన్ని సమకూర్చారు.

2017 నాటి ఈ వాహనాన్ని రాజాసింగ్ ఇంటి వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. తనకు మరో వాహనం కేటాయించడంపై రాజాసింగ్ స్పందించారు. తాను ప్రస్తుతం ఇంటి వద్ద లేనని, వెళ్లాక వాహనం కండిషన్ చూస్తానని పేర్కొన్నారు. తనకు కొత్త వాహనమే కావాలనేం లేదని, పాతదైనా కండిషన్‌లో ఉంటే చాలని రాజాసింగ్ అన్నారు