మేడారం జాతర కోసం 3850 ప్రత్యేక బస్సులు ఏర్పటు చేసిన టీఎస్ ఆర్టీసీ

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఆదివాసి జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ జాతరకు దేశం నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు. ఈ తరుణంలో టీఎస్ ఆర్టీసీ 3,845 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.

జాతర జరిగే రోజులలో అన్ని జిల్లాల నుంచి మేడారం జాతరకు వచ్చే లా ఈ ముప్పై ఎనిమిది వందల యాభై బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు.

అలాగే ఈ బస్సులు ఆగేందుకు మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండు ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మేడారం జాతర లో పాల్గొనాలని భక్తులకు సూచించారు ఆర్టీసీ అధికారులు. కాగా తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మహా జాతర మేడారం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర సాగుతుంది. 2022 సంవత్సరంలో భాగంగా.. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల్లో ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. ఈ పండగను 2014లో రాష్ట్ర పండగుగా ప్రభుత్వం గుర్తించింది.