భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర

ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు మరోవైపు పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు సామాన్యుడిపై ఇప్పుడు మరో భారం పడింది. ఈరోజు( సెప్టెంబర్ 1 ) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ గ్యాస్ ధరను రూ.25.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

ఒకటో తారీకు వస్తుందంటే చాలు సామాన్యులు భయం వేస్తుంది. ఏ ధరలు ఎంత పెరుగుతాయో అని ఖంగారు పడుతుంటారు. ఇప్పుడు సెప్టెంబర్ 1 వచ్చింది. గ్యాస్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ధరల పెంపు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. పెరిగిన ధర నేపథ్యంలో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు రూ.884కు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండేది. ఇప్పుడు రూ.884కు చేరింది. గత ఏడేళ్ల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అవ్వడం గమనార్హం.

మాయదారి కరోనా వల్ల ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి సామాన్య,మధ్యతరగతి జీవులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో… ఇలా ధరల మీద ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.