రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 10 కోట్లు మంజూరు – సీఎం రేవంత్

cm-revanth-reddy

తెలంగాణ‌లోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,190 కోట్లును మంజూరు చేసింది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. జిల్లా ఇంచార్జి మంత్రుల ఆమోదంతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని జీవోలో పేర్కొంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో విద్యాసంస్థ‌ల‌కు రూ. 2 కోట్లు, మంచినీటికి రూ. కోటి చొప్పున మంజూరు చేసిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం వెచ్చించాలని పేర్కొంది. జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతోనే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది.

కరీంనగర్ జిల్లా రూ. 130 కోట్లు కేటాయించగా అందులో రూ. 26 కోట్లు ప్రాథమిక విద్యా సదుపాయాలు, రూ. 13 కోట్లు తాగునీటి సౌకర్యం, రూ. 6.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. మహబూబ్ నగర్ రూ. 140 కోట్లు, ఖమ్మం రూ. 100, రంగారెడ్డి రూ. 140, వరంగల్ రూ.120, హైదరాబాద్ రూ. 15 మెదక్ రూ. 100 కోట్లు, ఆదిలాబాద్ 100 కోట్లు, నల్గొండ రూ. 120 కోట్లు, నిజామాబాద్‌ రూ. 90 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.