తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ 2021 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేసారు. ఈ సారి ఎడ్‌సెట్‌లో 98.53 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎడ్‌సెట్‌కు 34,185 మంది విద్యార్థులు హాజరుకాగా.. మొత్తంగా బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. అందులో 25,983 మంది అమ్మాయిలే ఉండడం విశేషం.
అలాగే ఈ తెలంగాణ ఎడ్ సెట్ పరీక్ష ఫలితాల్లో లో నల్గొండకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్ కు మొదటి ర్యాంకు సాధించాడని పేర్కొన్నారు. మంచిర్యాల విద్యార్థిని ఎ. ప్రత్యూష కు రెండో ర్యాంకు వచ్చిందని తెలిపారు. అలాగే పాట్నకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు వచ్చిందని స్పష్టం చేశారు. ఇక ఎడ్ సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం…https://edcet.tsche.ac.in/ అనే వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చన్నారు.