మహేష్ చేతికి ‘బిగ్ సి’..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా ఇతర బిజినెస్ ల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సౌత్ లో టాప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ ..తాజాగా మరో సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.

ఇప్పటికే మహేష్.. అభి బస్ యాప్, సంతూర్, థంబ్స్ అప్, లాయిడ్ ఎసిలు, పాన్ బహార్, హెల్త్ ఓకే టాబ్లెట్‌లు మొదలైన అనేక కంపెనిలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పుడు దేశం లోనే పెద్ద కంపెనీ అయిన “బిగ్ సి మొబైల్స్‌ ” కు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయ్యారు. దీని కోసం మహేష్ బాబు కు భారీ మొత్తమే చెల్లించదని తెలుస్తుంది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. నవంబర్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.