మూడు రాజధానుల పేరుతో సీఎం కొత్త ఎత్తుగడ వేశారు

బినామీల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారు

buddha venkanna
buddha venkanna

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై టిడిపి నేత బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. గతంలో దోచుకున్న సొమ్ము అంతా సీబీఐ, ఈడీ అటాచ్మ్‌ంట్‌ చేసేసరికి మూడు రాజధానుల పేరుతో కొత్త ఎత్తుగడ వేశారు సీఎం జగన్‌ గారు అని విమర్శించారు. బినామీల పేరుతో విశాఖలో భారీ భూకుంభకోణానికి తెరలేపారని అన్నారు. మరో 50 వేల కోట్ల కొట్టేయడానికి మూడు రాజధానులు ముద్దు అంటూ సీఎం మరోసారి తన మార్క్‌ ముద్దుల ర్యాలీలకు తెరలేపాడని బుద్దావెంకన్న దుయ్యబట్టారు. ఇంకా విశాఖలో జరుగుతున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆధారాలతో సహా బయటకు రావడం ఖాయమని వడ్డీతో సహా సీఎం జగన్‌ గారు 8 నెలల నుండి విశాఖలో ఉండి ల్యాండ్‌ మాఫియా కింగ్‌ పిన్‌గా మారిన ఎంపీ విజయసాయిరెడ్డి ఊచలు లెక్కపెట్టడం ఖాయమని బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/