జగన్ ను కలిసిన నటుడు అలీ

నటుడు అలీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. బుధువారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వారు జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్ కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెండితెర, బుల్లితెరపై అలీ చాలా పాపులర్‌. గత ఎన్నికల సమయంలో అలీ వైస్సార్సీపీ లో చేరారు. పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. అలా జగన్‌కు దగ్గర అయ్యారు. దీంతో అలీకి మంచి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పడు అలీ పేరు తెరపైకి వచ్చింది. కానీ.. అలీకి తాజాగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలు అప్పగించారు. జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అలీ సంతోషం వ్యక్తం చేశారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. తనను గౌరవిస్తూ ఇచ్చిన పదవి పట్ల అలీ ఆనందం వ్యక్తం చేశారు. సతీసమేతంగా ధన్యవాదాలు చెప్పారు. తన భార్య జుబేదాతో కలసి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.