ఇ-రూపిని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోడి

PM Modi launches e-RUPI digital payment solution

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఇ-రూపిని ఆవిష్క‌రించారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఈరూపీ వోచ‌ర్‌ను రిలీజ్ చేశారు. డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషించనున్న‌ట్లు మోడి తెలిపారు. టార్గెట్ ప్ర‌కారం.. చాలా పార‌ద‌ర్శ‌కంగా.. ఎటువంటి లీకేజీ లేకుండా న‌గ‌దును డెలివ‌రీ చేయ‌వ‌చ్చు అని మోడి అన్నారు. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఇ-రూపిని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు అని ఆయ‌న చెప్పారు. క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచ‌ర్‌ను పంపిస్తారు. ల‌బ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచ‌ర్‌ను డెలివ‌రీ చేస్తారు. దాని ద్వారా అమౌంట్‌ను వాడుకోవ‌చ్చు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/