రేపు పిజెఆర్ కుమారుడి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ..

కాంగ్రెస్ పార్టీ లో నేతల మధ్య విభేదాలు అనేవి కొత్తేమి కాదు..ఈ మధ్య కాస్త సద్దుమణిగినట్లు అంత అనుకున్నారో లేదో..మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేపు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో సీనియర్లు ప్రత్యేకంగా భేటీ కాబోతుండడం ఇప్పుడు చర్చ గా మారింది. ఈ భేటీ లో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్‌ సహా 15 మంది హాజరుకాబోతున్నారు. కొంతకాలం నుంచి పార్టీకార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి నిన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. ఆ తర్వాత పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీతో విష్ణు సమావేశం కాగా..ఆయా భేటీల్లో ప్రస్తుత పీసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే రేపు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ భేటీ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి.

ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ లో ఉన్నారు. బడంగ్‌పేట మేయర్ దంపతులు ఈరోజు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మే నెలలో మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితోపాటు ఆమె భర్త, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు బడంగ్‌పేట మేయర్ దంపతులు సైతం అదే బాటలో నడిచారు. ఈ సందర్బంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో సమావేశమయ్యారు. కేసీఆర్ సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారంతా తమ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌తో కలిసి పని చేస్తే ప్రజాసమ్యలను పరిష్కరించలేని పరిస్థితులు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.