అట్టహాసంగా బిగ్ బాస్ ఫేమ్ ‘అవినాష్ ‘ నిశ్చితార్థం

జబర్దస్త్ షో తో గుర్తింపు తెచ్చుకున్న ‘అవినాష్ ‘ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన ముక్కు అవినాష్.. హీరోల వాయిస్‌లు, బాడీ లాంగ్వేజ్‌లను అనుకరిస్తూ స్టేజ్ షోలు, ఈవెంట్లస్తూ..జబర్ధస్త్ ఛాన్స్ కొట్టేసాడు. ఈ షో తో అతి తక్కువ టైంలోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపు తో బిగ్ బాస్ షో లో ఛాన్స్ కొట్టేసాడు. బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యారు. ముఖ్యంగా షో లో మరో సభ్యురాలైన ఆరియానాతో ఎక్కువగా స్నేహం చేసి.. నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు. దాదాపు పైనల్ వరకు వెళ్లిన అవినాష్.. అనుకోకుండా ఎలిమినేట్ కావడంతో ప్రేక్షకులు షాకయ్యారు. ఇక బిగ్‏బాస్‏ ఇంటి నుంచి వచ్చిన తర్వాత నెట్టింట్లో అవినాష్ చేసిన హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పలు షో లతో బిజీ గా ఉన్న అవినాష్..సడెన్ గా నిశ్చితార్థం చేసుకొని షాక్ ఇచ్చాడు.

అనూజ అనే అమ్మాయితో ఎంగెజ్‏మెంట్ జరిగినట్లుగా తెలిపాడు అవినాష్. ఎంగెజ్‏మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎక్కువ రోజులు వెయిట్ చేసిన తర్వాత సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చేస్తారు. మా రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. అలాగే మేము కలుసుకున్నాము. మా నిశ్చితార్థం. మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు మీ పెళ్లి ఎప్పుడూ అని.. అతి త్వరలోనే నా అనూజతో.. ఇలాగే మీ ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ మీ ముక్కు అవినాష్.. సారీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశాడు .