వైజాగ్ లో బరితెగించిన జనసేన నేత రాఘవరావు..

జనసేన నేత రాఘవరావు బరితెగించాడు. ప్రేమిస్తున్నాని ఓ అమ్మాయి వెంటపడడమే కాదు..ఫుల్ గా మద్యం సేవించి కత్తి పట్టుకొని అమ్మాయి ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి.. తనను ప్రేమించకపోతే.. కత్తితో చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన వైజాగ్ లో చోటుచేసుకుంది.

నేటి సమాజంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, దారుణాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డకు రక్షణ అనేది లేకుండా పోతుంది. లైంగిక వేధింపుల వంటి ఘటనలతో మహిళలు తీవ్ర వేదన చెందుతున్నారు. కొందరు కామాంధులు దారుణంగా చిన్న పిల్లలను కూడా వదిలి పెట్టడటం లేదు. తమను ప్రేమించాలంటూ, కోరిక తీర్చాలంటూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు , కోర్ట్ లు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మార్పు అనేది రావడం లేదు.

తాజాగా వైజాగ్ కు చెందిన జనసేన నేత రాఘవరావు తన వయసును మరచిపోయి…మనవరాలు వయసున్న అమ్మాయి ని ప్రేమిస్తున్నాని వేధించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. విశాఖపట్నంలోని చినవాల్తేరు లోని ఓ అపార్టు మెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి సదరు అమ్మాయి నివాసం ఉంటుంది. అయితే ఆ యువతిని జనసేన పార్టీ నాయకుడు రాఘవరావు కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతీ వాట్సాప్ లో అసభ్యకర మెసేజ్ లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఇలా నిత్యం వేధిస్తున్న సదరు అమ్మాయి.. భరిస్తూ వచ్చింది. ఈక్రమంలోనే బుధవారం మరోసారి రాఘవరావు ఆమె నివాసం ఉంటున్న ప్లాట్ కు మద్యం సేవించి వెళ్లాడు. ఇంట్లో నుంచి బయటకి రావాలంటూ ఆ అమ్మాయిని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ అమ్మాయి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు వెంటనే ఆ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని.. అతడ్ని వారించే ప్రయత్నం చేశారు. వారిపైన కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి బెదిరింపులు దిగాడు.

‘మీ మనవరాలు వయసు ఉన్న అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం సరికాదని అమ్మాయి స్నేహితులు బ్రతిమిలాడారు’ దీంతో రాఘవరావు ఇంకా రెచ్చిపోయాడు. ‘నేను జనసేన రాష్ట్ర నాయకుడిని.. నాకు పవన్ కళ్యాణ్ తెలుసు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తాను’ అని బెదిరించాడు. అయితే.. రాజకీయ పలుకుబడి ఉన్న నేత కావడంతో.. బయటికి రావడానికి బాధిత అమ్మాయి భయపడుతోంది. ఎట్టకేలకు ధైర్యం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఈ ఘటన పట్ల పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.