కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం

ప్రగతి భవన్ లో మంత్రిమండలి భేటీ

TS Cabinet approval for key decisions
TS CM Kcr

Hyderabad: తెలంగాణ కేబినెట్ ఆదివారం ప్రగతి భవన్ లో భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ఆమోదం తెలిపింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశామని, . ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది కేబినెట్ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఇందుకు సత్వర కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/