ఎట్టకేలకు బంగార్రాజు రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్

బంగార్రాజు..సంక్రాంతి కి వస్తుందా..రాదా అనేదానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. బంగార్రాజు ను సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. ముందు నుండి సంక్రాంతి ఫై కన్నేసిన బంగార్రాజు..మధ్యలో ఆర్ఆర్ఆర్ వచ్చేసరికి రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఇక చివరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ వాయిదాపడడం తో బంగార్రాజు రిలీజ్ కు దారి దొరికింది.

ఈ సందర్భంగా బుధవారం సినిమాలోని ‘బంగారా’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ‘బంగార్రాజు’ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ – టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ సమయం ఎంతో దూరంలో లేకపోవడం తో ప్రమోషన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బ్లాక్ బస్టర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ గా ”బంగార్రాజు” రూపొందింది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.