ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 2,287 మందికి పాజిటివ్‌

corona cases in AP

Amaravati: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. . గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,287 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 18 మందిమృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,68,462కు పెరిగాయి. వైరస్‌ బారినపడిన వారిలో శనివారం 2,430 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం వరకు మొత్తం 19,34,048 మంది కోలుకున్నారు. 21,019 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,395కు చేరాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 85,856 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/