టిక్‌టాక్ నిషేధానికి చర్చలు జరుగుతున్నాయి
అమెరికా పౌరుల సమాచార గోప్యతపై ఆందోళన
వాషింగ్టన్: టిక్‌టాక్‌తో సహ 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో టిక్‌టాక్‌ను నిషేధించే విషయంలో తమ పరిపాలన విభాగం పరిశీలిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని, నిషేధానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. అమెరికా పౌరుల సమాచార గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గత నెలలో పేర్కొన్నారు. మరోవైపు, టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై టిక్‌టాక్ స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధార వార్తలని, ఇలాంటి ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. టిక్‌టాక్ దీర్ఘకాలిక విజయంపై తమకు నమ్మకముందని స్పష్టం చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/