మర్రి శశిధర్‌ రెడ్డికి అద్దంకి దయాకర్‌ సూచన

టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కార్యకర్తల్లో ఆందోళన పెంచుతుంది. తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సీనియర్లను పట్టించుకోవడం లేదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మణిక్కం ఠాగూర్‌… రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాణిక్కం ఠాగూర్‌పై స్పందిస్తూ.. తాను సోనియాగాంధీ కి తప్ప ఎవరికీ ఏజెంట్‌ని కాదని ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

దీనిపై అద్దంకి దయాకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కాంగ్రెస్‌ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసిన కామెంట్స్ పెద్దదిగా చేయకుండా సద్దుమణిగే విధంగా ఉంటే బాగుండేది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలకు కాంగ్రెస్‌ పావుగా మారుతోంది. సీనియర్‌ నేతలు మాట్లాడితే కాదు అనే వారు ఎవరూ లేరు. అంతర్గత అంశాల మీద మీరే సలహాలు ఇవ్వాలి. కానీ, పీసీసీని ఇలా అంటే పార్టీకి నష్టం కదా?. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఉంది. ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. ఒక సీనియర్ నాయకుడిగా మీరు(మర్రి శశిధర్‌ రెడ్డి) ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. నన్ను కూడా మీరు అన్నందుకు స్పందిస్తున్నాను. రేవంత్ చెప్తే నేను స్పందించడం లేదు’’ అంటూ కామెంట్స్‌ చేశారు.