నల్లా కనెక్షన్ల విషయంలో GHMC సీరియస్

హైదరాబాద్ నగరవాసులకు GHMC హెచ్చరిక జారీచేసింది. బిల్లులు చెల్లించని కమర్షియల్‌ కనెక్షన్ల విషయంలో కఠినంగా ఉంటామని.. 6 నెలలు, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే కనెక్షన్లను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

గత కొన్ని రోజులుగా రెవెన్యూ పెంపుపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఎండీ. ఇది సత్ఫలితాన్ని ఇచ్చిందని.. కొన్ని మొండి బకాయిలు వసూలయ్యాయని చెప్పారు. ఇలా ఆదాయం క్రమంగా పెరుగుతోందని.. ఇక మరింతగా దృష్టి పెట్టామన్నారు. నగరంలో 6 నెలల కంటే ఎక్కువ రోజులుగా బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్‌లు 1095 ఉన్నాయని.. రూ.8.31 కోట్ల బకాయిలు ఈ కనెక్షన్ల నుంచి రావాల్సి ఉందన్నారు. నాన్‌ ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ (నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని) పరిధిలో ఉన్న కనెక్షన్ల బకాయిలపైనా ఫోకస్ పెట్టనున్నారు. ఈ బకాయిలను కూడా వసూలు చేయాలని అధికారులకు ఎండీ సూచించారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేసిందన్నారు.