అమెరికాలో 24 గంటల్లో 60 వేల కేసులు

మొత్తం మరణాల సంఖ్య 1,32,000

coronavirus america
coronavirus america

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. బుధ‌వారం ఒక్క‌రోజే 60 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఫ్లోరిడాలో 10 వేలు, టెక్సాస్ లో 9,500, కాలిఫోర్నియాలో 8,500ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాలిఫోర్నియా, టెక్సాస్ లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా అత్య‌ధికంగా సంభ‌వించాయి. బుధ‌వారం ఒకే రోజు 900ల‌కు పైగా క‌రోనాతో మృతి చెందారు. టెన్నెసీ, వెస్ట్ వర్జీనియా, ఉత్హాలో ప్ర‌తి రోజు కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త రెండు వారాల నుంచి 42 దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసులు 3 మిలియ‌న్ల‌కు పైగా న‌మోదు అయ్యాయి. 1,32,000 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/