అతిపెద్ద రోడ్ షోలో పాల్గొననున్న ట్రంప్‌, మోడి!

ఆపై మొతేరాలో భారీ బహిరంగ సభ

trump, modi
trump, modi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి ఈ నెల చివరి వారంలో భారత్ లో పర్యటించనుండగా, అహ్మదాబాద్ లో 22 కిలోమీటర్ల దూరం జరిగే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడితో లిసి పాల్గొంటారని నగర మేయర్ బిజాల్ పటేల్ వ్యాఖ్యానించారు. దారి పొడవునా దాదాపు 50 వేల మంది వారికి స్వాగతం పలుకుతారని, ఇంత అధిక దూరం ప్రజలు నిలబడే అతిపెద్ద రోడ్ షో ఇదే కావచ్చని ఆయన అన్నారు. ఈ రోడ్ షోకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హాజరై, తమతమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని ఆయన అన్నారు. కాగా, తన పర్యటనలో భాగంగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమంతో మహాత్మా గాంధీకి ఎంతో అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆపై ట్రంప్, మోడిలు మొతేరాలో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి చేరుకుని, అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/